Srikanth Miryala
@miryalasrikanth
నాన్న/రచయిత #KGHKathalu/ Psychiatrist
ఫలించిన నిరీక్షణ. నేను రాసిన మొదటి పుస్తకం విడులైంది. పుస్తకం అమెజాన్ లో లభ్యం . #KGHKathalu KGH Kathalu amazon.in/dp/B09YHZ24YZ/… #Amazon
నీ పొట్టని బిగబట్టినంత కాలం, ఇసుకలో తల దూర్చిన ఉష్ట్రపక్షి లాగా నీకు పొట్టలేదని తిరుగుతావు. దాన్ని వదిలేయ్, వేరేవాళ్ళు నవ్వుకోనీ, కానీ నీ బాగుకోరేవాళ్లు మాత్రం, “ఏంటి ఈ పొట్ట” అని నిలదీస్తారు. అక్కడ నీలో మార్పు మొదలవుతుంది. వ్యాయామం మొదలుపెడతావు.
చాలామంది గుండెపోట్లు, ఆత్మహత్యలు ఇప్పుడు చూసి గుండెలు బాదుకుంటున్నారు, కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి ఇప్పుడు పేలే బాంబులు అనుకుంటే వీటికి పొడవైన వత్తులు ఉండి ఉంటాయి. ఈ వత్తుల్ని ఇంటర్మీడియట్ కాలేజీలు అగ్గిపుల్ల వేసి వెలిగిస్తారు. వత్తి పొడవు బట్టి మన ఆయుర్దాయం.
ఇదే తెలుగులో నా నిజాయితీ గల అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చారిత్రకంగా, మన దేశం ఎక్కువ జనాభాతో, తక్కువ ఆహార వనరులతో ఉండేది. అయితే, హరిత విప్లవం, శ్వేత విప్లవం, ఎక్కువ ఎరువుల వినియోగం, మరియు సాగునీటి ద్వారా నీటి లభ్యత పెరగడంతో, ఇప్పుడు మన దేశం గతంలో కంటే ఎక్కువ…
I want to share my honest perspective. Historically, our country has had a large population with limited food resources. However, with the Green Revolution, White Revolution, increased fertilization, and improved water availability through irrigation, our nation now produces…
I want to share my honest perspective. Historically, our country has had a large population with limited food resources. However, with the Green Revolution, White Revolution, increased fertilization, and improved water availability through irrigation, our nation now produces…
Another young life gone. 25-year-old Rakesh collapsed and died of a heart attack while playing badminton in Hyderabad. Why are so many fit, young Indians suddenly collapsing like this? We deserve honest answers, not silence.
మీ ఇంట్లో ఇదివరకే ఎవరికైనా మూల కణాల (స్టెమ్ సెల్స్) ద్వారా నయం చేయగలిగే వ్యాధి ఉంటే తప్ప అప్పుడే పుట్టిన పిల్లల బొడ్డు రక్తం ప్రైవేటు కంపెనీలకి డబ్బు చెల్లించి దాచాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ దాచిన రక్తం అదే బిడ్డకి పనికొచ్చిన దాఖలాలు లేవు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు.
డాక్టర్లు కనిపెట్టి, పుస్తకాల్లో రాసి, పరిశోధనా పత్రాల్లో రాసి, ఇంటర్నెట్లో ఉచితంగా పెడితే దాన్ని ఈ @grok చదివి మళ్లీ మీకు చెప్తుంది. అంతేగానీ అదేమీ కనిపెట్టదు. డాక్టర్లు కనిపెట్టిందే మళ్లీ నా లాంటి డాక్టర్లు చదివి ఇక్కడ మీకోసం రాస్తారు.
@grok is it true.?
నలభై నిండితే డాక్టర్లకి చదువైపోయి లెయిడ్ బ్యాక్, టెకీలకి స్కిల్ అయిపోయి లే ఆఫ్, అన్నమాట.
మొట్టమొదట బొగ్గు పులుసు వాయువు అన్నారు, దానికి వ్యతిరేకం ప్రాణవాయువు అన్నారు. ఈ ప్రాణవాయువు ఉన్నదాన్ని మంచి రక్తం అన్నారు, లేని దాన్ని చెడురక్తం అన్నారు. ఇదంతా ఐదో తరగతి వరకు, అక్కడ్నుంచి పదో తరగతిలో మళ్లీ కార్బన్ డై ఆక్సైడ్ అన్నారు, ప్రాణవాయువుని ఆమ్లజని అన్నారు. ఇప్పుడు రక్తాల…
విజ్ఞానం ఎంత పెరిగినా పాఠ్యపుస్తకాలు మార్చినా చెప్పే విధానం లక్ష్యం అదే. వాడు పుస్తకంలో న్యూటన్ చెప్పాడనో హెచ్ సి వర్మ బుక్కు లాస్ట్ పేజీ లో ఆన్సర్ 10 ఉందనో వాళ్ళు ఆల్రెడీ పాతేసిన ఒక దారిలో గానుగెద్దులా నువ్వు పరిగెట్టడం నేర్చుకోవాలి. ఎంత ఫాస్ట్ పరిగెడితే అంత గొప్ప. ఫస్టు…
మా ఊర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసేసి ఇక మీరే గెలిచేశారు అన్నాసరే పరిగెత్తించి కొడతారు. మీరు వెయ్యాల్సిందే మేము బాదాల్సిందే.
Ben Stokes 🏴 offers a draw 🤝🏻 - India 🇮🇳 denies and continues to bat 🧐 - What's your take on this 🤔
నువ్వొక నటుడ్ని అభిమానిస్తే అతను నటించిన పాత్రల్ని ఇష్టపడాలి, నచ్చకపోతే చెప్పాలి. అంతేగానీ నీకు నచ్చిన పాత్రలే చెయ్యాలని డిమాండు చెయ్యకూడదు.

దయచేసి నగరాల్లో పావురాలకి దూరంగా ఉండండి, అవి వేసే రెట్టల్లో, వదిలేసే ఈకల్లో వాటి ప్రోటీన్లు గాలిలో కలిసి అవి మనం పీల్చి మొదట హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ కి ఆ తర్వాత లంగ్ ఫైబ్రోసిస్ కి దారి తీస్తాయి. అందరూ పావురాలకి నూకలు వేస్తారు, నీకెవడూ ఊపిరితిత్తి దానం చెయ్యడు.
ఢిల్లీ ఎప్పుడెళ్తాడా అని చూస్తున్నాను, టోల్ గేటు దగ్గరే సినిమా అయిపోయింది 🤔.
ఏదో టీ కాఫీ లాంటి సినిమాలు తీస్తాడని ఆ దర్శకుడు తీసింది టీవీలో పెట్టా, అరగంట చూసాక మా పెద్దోడు, “ఈ మర్డర్లు, మోసాలు, రోడ్డు ప్రమాదాలు, అత్యాచారాలు ఏంటి, అసలు ఏం సినిమాలు చూస్తున్నావ్, మూర్ఖుడా!” అని మొహమాటం లేకుండా తిట్టేసి పోయాడు. నేను కూడా సిగ్గుతో ఇక ఆపేసా ఇక చూడటం. 🙏
సాయంత్రం ఎనిమిది వరకూ వార్డులో పేషెంట్లని చూసి వచ్చి, బండి మీద శ్రీమతితో జయనగర్ వెళ్లి, అలా శ్రీ వెంకటేశ్వర ఉత్తర కన్నడ రెస్టారెంటులో భోంచేసి, గరుడా స్వాగత్ మాల్లో విడుదలైన ఏదో ఒక తెలుగు సినిమా సెకండ్ షో చూసేసి తిరిగి నిమ్హాన్స్ కి వచ్చేసే రోజులు బాగుండేవి.
ఇప్పుడూ వివాహేతర సంబంధంలోని ప్రేమికుడికి నీ భర్త ఉన్నంత వరకే విలువ, ప్రేమ. వాడికోసం భర్తని లేపేస్తే ఆ ప్రేమికుడు నీ భర్తవుతాడు మళ్లీ బోరు కొడతాడు.

డాక్టర్ గారూ, బాగా చూసారు, ధన్యవాదాలు. ఇంద మీ ఫీజు ఐదొందలు. మంచిది. అన్నట్లు డాక్టర్ గారూ, మన వీధిలో వినాయక మంటపం పెడుతున్నాం. మీ చందా వెయ్యి రూపాయలు. ఈ ఐదొందలు తో పాటు వచ్చే కన్సల్టేషన్ మీరు ఫ్రీగా చేసేస్తే మొత్తం వెయ్యి మీ తరుపున నేను ఇచ్చేస్తాను.
ఇలా గంజి పడేస్తే ఉన్న విటమిన్లు కూడా పోతాయి. వార్చాలనుకుంటే వార్చండి కానీ ఆ గంజి తాగండి. గమనిక- కుక్కర్ వలన సమయం, శక్తి, శ్రమ ఆదా అవుతాయి. విటమిన్లు లోపలే ఉంటాయి.
బాగా చదువుకున్నవాళ్ళు కూడా చాలా సాధారణమైన మాటల్ని తీవ్రంగా వక్రీకరించి ద్వేష పూరిత మాటలు అని అపవాదు వేసి ద్వేషాన్ని పెంచుతున్నారు. ఇది వాళ్ళు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఇలా ప్రతిఘటిస్తున్నాం అని చెప్తారు కానీ అదొక ముసుగు మాత్రమే, అది పూర్తిగా వారి వ్యక్తిగత మనుగడ కోసం అనే విమర్శ.
క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చు. @Telugu_toonz మీకు అభినందనలు. వ్యాయామం చెయ్యండి, ఆరోగ్యంగా ఉండండి. అందంగా కనిపించండి. ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుకోండి.
సమతుల్య ఆహారం తినండి, వ్యాయామం చెయ్యండి అని చెప్పేది ఎక్కువకాలం బ్రతికేస్తారని కాదు, బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉంటారని. ఆరోగ్యమే ఆనందం. ఆయుష్షు అదనం దానికి అంతే.